కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వైరస్ను నియంత్రించేందుకు కరోనా పుట్టిన వుహాన్కు 4 వేల మంది వైద్య సిబ్బందిని పంపుతున్నట్లు చైనా సైనికాధికారులు తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు 2912మంది మరణించారు. ఇప్పటివరకు ఒక్క వుహాన్ నగరంలోనే 2200 మంది మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి చైనా ప్రభుత్వ వర్గాలు.
ఇప్పటి వరకు హుబే ప్రాంతంలో సైనిక వైద్య సిబ్బంది 4,450 మందికి వైద్య సేవలు అందించగా.. అందులో వెయ్యి మందికి ఆరోగ్యం కుదుటపడినట్లు తెలిపారు. అంతేకాకుండా హుషెన్‌షాన్ ఆసుపత్రిలో సేవలు ప్రారంభినప్పటి నుంచి 1597 మందికి వైద్యం అందిచగా.. 611 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 2 వేల మంది వైద్య సిబ్బందికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు.
89వేల కేసులు...