ఈ చిత్రాన్ని చూస్తే ఒకే చోట ఇన్ని పొక్లెయిన్లు ఇంత హడావుడిగా భూమిని ఎందుకు చదును చేస్తున్నాయనే సందేహం కలగకమానదు. చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌తో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు 10రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు ఇలా వేగంగా జరిగిపోతున్నాయి.
10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం! - latest china virus news
చైనాలో రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే వైరస్‌తో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రారంభమైన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
10 రోజుల్లోనే 1000 పడకలతో కొత్త ఆస్పత్రి
ఫిబ్రవరి 3 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. డజన్లకొద్దీ ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు రంగంలో దిగి చకచకా పనులు చేస్తున్నాయి. ముందే తయారుచేసుకున్న నిర్మాణాలతో 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో ఆసుపత్రి సిద్ధం కానుంది.
ఇదీ చూడండి:'హ్యూస్టన్'లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
Last Updated : Feb 18, 2020, 8:01 AM IST