భారతీయులను ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై దుమారం చెలరేగడం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు క్షమాపణలు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే 29 ఏళ్ల యైర్.. తన తండ్రి అవినీతి ఆరోపణల కేసులో ప్రాసిక్యూటర్ అయిన లియాత్ బెన్ అరీ ముఖాన్ని ఓ దేవత ఫొటోకు జతచేసి పోస్ట్ చేశారు. యైర్ ట్వీట్‌ను భారతీయ నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.
దీంతో స్పందించిన యైర్ నెతన్యాహు.. తన తప్పును తెలుసుకున్నట్లు చెప్పారు.
"ఇజ్రాయెల్‌లోని రాజకీయ నేతలను విమర్శించే వ్యంగ్య పేజీ నుంచి ఈ మీమ్‌ను ట్వీట్ చేశాను. హిందూ విశ్వాసానికి సంబంధించిన చిత్రం కూడా మీమ్‌లో ఉన్నట్లు గ్రహించలేదు. కామెంట్ల రూపంలో భారతీయ స్నేహితులు తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత.. ట్వీట్‌ను తొలగించాను. నేను క్షమాపణలు కోరుతున్నాను."