ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. వైరస్ నియంత్రణకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి మాస్క్‌లు, కరోనా నియంత్రణకు వాడే వైద్య పరికరాల ఎగుమతికి అనుమతినివ్వాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశ ప్రజల అవసరాల దృష్ట్యా మాస్క్‌ల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో మోదీకి.. ఇజ్రాయిల్ ప్రధాని ఫోన్ చేసినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.
'కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా అవసరమైన పరికరాల సరఫరాను యథావిధిగా కొనసాగించాలని నా స్నేహితుడైన ప్రధాని మోదీని కోరాను.'