భారత్ భూములు మావే అంటున్న నేపాల్ కొత్త మ్యాప్..
వివాదాస్పద కాలాపానీతో పాటు మరో రెండు భారత ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ రూపొందించిన కొత్త మ్యాప్‌ను ఆ దేశ పార్లమెంటు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 57 మంది ఎంపీల ఓట్లతో నేపాల్ సరికొత్త పటానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడకపోవడం గమనార్హం.
ఈ రాజ్యాంగ సవరణ బిల్లును దిగువ సభ ఇదివరకే ఏకగ్రీవంగా ఆమోదించింది.