నేపాల్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ.. స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
నిజానికి ఈ స్టాండింగ్ కమిటీ సమావేశం ఇంతకుముందే జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఐదుసార్లు వాయిదా పడింది. తాజాగా ఈ భేటీ ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది.
కుదరని సయోధ్య...
ఇటీవలి కాలంలో నేపాల్ ప్రధాని ఓలి, పార్టీ కో-చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ మధ్య భేదాభిప్రాయాలు తారస్థాయికి చేరాయి. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు శనివారం జరిగిన సమావేశం కూడా విఫలమైంది. ఏకధాటిగా నాలుగు గంటలపాటు చర్చలు జరిగినప్పటికీ లాభం లేకుండా పోయింది.
ఇదీ చూడండి:-ప్రధాని నయా వేదాంతం.. రాముడు నేపాలీ అట!
అయితే.. ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవడానికి.. ఈ 9 మందితో కూడిన కేంద్ర సెక్రటేరియట్ సమావేశంలో నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది.
మొత్తం మీద ఓలి-ప్రచండ మధ్య సమస్య పరిష్కారానికి 8సార్లు చర్చలు జరిగాయి. కానీ ఏవీ ఫలితాల్ని ఇవ్వకపోవడం గమనార్హం.
ఇదీ జరిగింది...
ఇటీవలే భారత్‌లోని మూడు ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకుంటూ.. ఓ మ్యాప్‌ను విడుదల చేసింది నేపాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అనంతరం ఆ మ్యాప్‌ను నేపాల్ పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంది. అప్పటి నుంచి నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. భారత్‌పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు ఓలి. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి భారత్ కుట్ర పన్నుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయనకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత్‌తో ఉన్న సత్సంబంధాలను ఓలి నాశనం చేస్తున్నారని.. ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రచండ సహా పార్టీలోని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి:-