తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది.. రెండు రోజుల తర్వాతే

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ భవిష్యత్​ను నిర్ణయించే అధికార కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారానికి వాయిదా పడింది. పార్టీ సభ్యులు ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

nepal
నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది.. మరో రెండు రోజుల తర్వాతే

By

Published : Jul 6, 2020, 1:44 PM IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి భవితవ్యాన్ని తేల్చే అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ సమావేశం జులై 8న జరగనుందని ప్రధాని మీడియా సలహాదారు సూర్య థాపా ప్రకటన విడుదల చేశారు. అయితే సమావేశం వాయిదా వేసేందుకు గల కారణాలు వెల్లడించలేదు.

రెండుసార్లు వాయిదా

శనివారమే ఈ కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో మొదటిసారి సోమవారానికి వాయిదా పడింది. తాజాగా రెండోసారి వాయిదా వేశారు.

45 మంది సభ్యులుగా గల స్టాండింగ్ కమిటీ నేపాల్ రాజకీయాల్లో అత్యంత కీలకమైనది. మాజీ ప్రధాని ప్రచండ సహా కమిటీలోని సభ్యులు.. ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఓలీ భారత వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓలీ అనుసరిస్తున్న విధానాలు రాజకీయంగా సరికాదని, దౌత్యపరంగా తగినవి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ స్టాండింగ్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే సమావేశానికి ముందు సోమవారమే ప్రచండ, ఓలీ భేటీ అవుతారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి:చీలిక దిశగా నేపాల్​ అధికార పార్టీ!

కీలక భేటీలతో ఉత్కంఠగా నేపాల్​ రాజకీయాలు

ABOUT THE AUTHOR

...view details