నేపాల్‌లో మరోసారి ప్రధానమంత్రి కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆ దేశ ప్రతినిధుల సభలో ఓలీ శర్మ మెజారిటీ కోల్పోయారు. ఈ మేరకు మద్దతు ఉపసంహరణ లేఖను పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ పంపింది సీపీఎన్ఎం.
ఓలీ శర్మ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని సీపీఎన్ఎం చీఫ్ విప్ దేవ్ గురుంగ్ ఆరోపించారు. నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మే 10న విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు ఓలీ ప్రకటించిన రెండు రోజుల తర్వాత సీపీఎన్ఎం మద్దతు ఉపసంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.