భారత ప్రాంతాలను తమవిగా చూపుతూ ప్రభుత్వం మ్యాప్‌లను రూపొందించడం, దేశ వ్యవహారాల్లో చైనా విపరీత జోక్యం తర్వాత నేపాల్‌లోని అధికార కమ్యూనిస్టు పార్టీలో ఏర్పడ్డ విభేదాలు ఆ పార్టీ చీలికకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫలితం శూన్యం
ప్రధాని కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ మధ్య ఏర్పడ్డ తీవ్ర స్థాయి విభేదాల పరిష్కారానికి వీరి మధ్య సుమారు ఆరు సార్లు సమావేశం జరగగా... ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం సైతం నాలుగు సార్లు వాయిదా పడగా దానిని శుక్రవారం జరపాలని నిర్ణయించారు.
ప్రచండకు ఇద్దరు మాజీ ప్రధానుల మద్దతు
పార్టీలో ప్రచండకు ఇద్దరు మాజీ ప్రధానులు, సీనియర్ నాయకులు మద్దతు ఇస్తున్నారు. వారే ప్రధాని పదవికి ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఓలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, దౌత్యపరంగా సరైనవి కావని వారు విమర్శించారు.
తేలేది అప్పడే..
దీనికి తోడు ఇటీవలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఏకపక్షంగా ప్రోరోగ్ చేయడం, కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం, పార్టీని ధిక్కరించి నిర్ణయాలు తీసుకోవడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగుతుందని భావిస్తున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధాని ఓలీ భవిష్యత్తు తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చూడండి:'భారతీయ అమెరికన్లకు ఇదో మేలుకొలుపు కావాలి'