నేపాల్‌కు చెందిన 150 హెక్టార్లకుపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న నివేదికలను ధ్రువీకరించారు ఆ దేశ ప్రజలు. మే నుంచి తమ భూమిని చైనా ఆక్రమించుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. ఓ వైపు ఈ అంశాన్ని చైనా తిరస్కరించటం, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మౌనంగా ఉన్న సందర్భంలో సరిహద్దు గ్రామాల ప్రజలు డ్రాగన్ దురాక్రమణను వెల్లడించటం గమనార్హం.
నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న బ్రిటన్ టెలిగ్రాఫ్ నివేదికను హుమ్లా జిల్లాలోని గ్రామాల ప్రజలు నిర్ధరించారు. తమ భూభాగాన్ని డ్రాగన్ దేశం స్వాధీనం చేసుకుందని స్పష్టం చేశారు.
"చాలా ఏళ్లుగా స్థానిక ప్రజల చేతిలో ఉన్న భూ భాగం ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. దీని ద్వారా మా భూమిని చైనా ఆక్రమించిందని స్పష్టంగా తెలుస్తోంది. హిల్సా జిల్లాలోనే 70 హెక్టార్ల భూమిని ఆక్రమించింది. "