నేపాల్ ప్రధానిగా తిరిగి నియామకమైన కేపీ శర్మ ఓలికి మంగళవారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చట్టసభల్లో సభ్యులు కాని ఏడుగురిని మంత్రులుగా తిరిగి నియమించిన ఓలి ప్రమాణ స్వీకారం చెల్లదంటూ దాఖలైన రిట్ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు ససేమిరా అంది. ప్రమాణస్వీకార సందర్భంగా రాష్ట్రపతి చెప్పిన మాటలను తిరిగి చెప్పేందుకు నిరాకరించిన ఓలి.. దేశాధ్యక్షపీఠాన్ని అవమానించారంటూ నాలుగు రిట్ పిటిషన్లు నేపాల్ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట - నేపాల్ సుప్రీంకోర్టు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలికి మంగళవారం ఆ దేశ సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చట్టసభల్లో సభ్యులు కాని ఏడుగురిని మంత్రులుగా తిరిగి నియమించిన ఓలి ప్రమాణ స్వీకారం చెల్లదంటూ దాఖలైన రిట్ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట
వీటిపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన సుప్రీంకోర్టు.. ప్రమాణస్వీకార సందర్భంగా ఏం జరిగిందన్న దానిపై 15 రోజుల్లోపు లిఖితపూర్వక సమాధానాలు సమర్పించాలని దేశాధ్యక్షురాలి కార్యాలయంతో పాటు ప్రధాని పేషిని, మంత్రిమండలిని కోరింది. ఈ సమాధానాలు చూసిన తరువాత రిట్ పిటిషన్లపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఇదీ చూడండి:నేపాల్ ప్రధానిగా మరోమారు ఓలీ ప్రమాణం