తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా సరఫరాపై భారత్​ సాయం కోరిన నేపాల్

టీకా సేకరణలో భాగంగా భారత్​ను సాయం కోరింది నేపాల్​. తమ దేశంలో 20 శాతం మందికి కావాల్సిన టీకాలను పంపణీ చేయాలని అభ్యర్థిస్తూ భారత్​కు లేఖ రాసింది నేపాల్​ ప్రభుత్వం.

Nepal seeks India's help to procure COVID-19 vaccines for 20 per cent of its population: Report
టీకా సరఫరాపై భారత్​కు నేపాల్​ అభ్యర్థన

By

Published : Dec 30, 2020, 8:33 PM IST

తమ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా టీకా సేకరణకు చర్యలు ముమ్మరం చేస్తోంది. నేపాల్​. ఈ క్రమంలో తమ దేశానికి వ్యాక్సిన్​ అందించాలని భారత్​ను అభ్యర్థించింది. దేశంలో 20 శాతం మందికి సరిపడా టీకాలు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తూ భారత్​కు లేఖ రాసిందని భారత్​ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

టీకా అందుబాటులోకి వస్తే.. నేపాల్​ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని గతంలోనే భారత్ హామీ ఇచ్చారు.

ఆక్స్​ఫర్డ్​ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా సహా దేశీయంగా తయారైన భారత్​ బయోటెక్​ టీకాలు భారత్​లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్​లో ఉన్న నేపథ్యంలో నేపాల్​ ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఇతర దేశాల్లో మూడోదశలో ఉన్న టీకాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది నేపాల్​. ఇప్పటికే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్​ దేశాలకు దౌత్య లేఖలు పంపింది​.

ఇదీ చూడండి:పోర్ట్​ బ్లెయిర్​లో జెండా ఆవిష్కరించిన ప్రధాని

ABOUT THE AUTHOR

...view details