నేపాల్‌లో పార్టీని విస్తరించే యోచనలో అధిష్ఠానం ఉందని భాజపా నేత, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా అభ్యంతరం తెలిపినట్లు.. ఓ నేపాలీ ట్విట్టర్ యూజర్‌కు సమాధానమిచ్చారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గైవాలీ.
ఈ మేరకు విదేశాంగ శాఖలో నేపాల్, భూటాన్ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి అరిందం బాగ్చీకి.. భారత్‌లో నేపాల్ రాయబారి నీలంబర్ ఆచార్య తమ దేశం తరఫున అభ్యంతరాన్ని తెలిపినట్లు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.