మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాంట్మాండులోని రాష్ట్రపతి భవనంలో జాతిపితపై రాసినపుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీ జీవితంలో ఆదర్శంగా నిలిచే ఘట్టాలు, యువతను ప్రభావితం చేసే అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లుభారత రాయబారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
మహాత్ముడి పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపాల్ అధ్యక్షురాలు - bidhya devi bandari book release on gandhi
మహాత్ముడి 151వ జయంతిని పురస్కరించుకొని నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి.. గాంధీపై రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. 'గాంధీ యాజ్ ఐ అండర్స్టుడ్', 'మైలే బుజేఖో గాంధీ' అనే పేర్లతో ఇంగ్లిష్‌తోపాటు నెేపాలీ భాషలో పుస్తకాన్ని రచించారు.
![మహాత్ముడి పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపాల్ అధ్యక్షురాలు Nepal President unveils pictorial anthology on Mahatma Gandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9488769-282-9488769-1604927701722.jpg)
గాంధీజీపై పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపాల్ అధ్యక్షురాలు
ఈ పుస్తకాన్ని భారత విదేశాంగ కార్యాలయం, బీపీ కోయిరాల ఇండియా-నేపాల్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రచురించాయి. మహాత్ముని బోధనలను నేపాలీ మిత్రులు ఆదరించి.. అనుసరిస్తారని ఫౌండేషన్ సభ్యులు ఆకాంక్షించారు.