నేపాల్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంటు ఎగువ సభ) నూతన సెషన్‌ను జనవరి 1 నుంచి నిర్వహించనున్నట్లు ఆ దేశ రాష్ట్రపతి విద్యా దేవి భండారి తెలిపారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా పార్లమెంటును డిసెంబర్ 20న రద్దు చేశారు ప్రధాని కేపీ శర్మ ఓలి. అనంతరం వారం రోజుల తర్వాత జాతీయ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.
పార్లమెంటును రద్దు చేస్తూ ఓలీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్సీపీలోని ప్రచండ మద్దతుదారులు ఏడుగురు కేబినెట్ మంత్రి పదవులకు గత వారమే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ను విస్తరించారు ఓలీ. ఒక సహాయ మంత్రి సహా మొత్తం 8మందికి నూతన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కొత్త మంత్రులతో రాష్ట్రపతి విద్యా దేవి భండారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు.