రాజకీయ సంక్షోభంలో ఉన్న నేపాల్‌లో 'అఖిలపక్ష' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించారు. దేశంలోని అస్థిరతకు పార్లమెంట్ సరిగ్గా లేకపోవడమే కారణమన్నారు.
ఓవైపు పార్లమెంట్‌ను దేశ అధ్యక్షురాలు రెండోసారి రద్దు చేయడాన్ని సమర్థిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు ఓలీ. పార్లమెంట్ రద్దుకు వారే కారణమని ఆరోపించారు. అసలు రద్దు కాకుండా చూసుకునేందుకు తాను శ్రమించానని, కానీ విపక్షాల నీచ రాజకీయల వల్ల పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్నారు.