తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రధాని మొండి ప్రవర్తన వల్లే పార్టీలో చీలికలు' - నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ

నేపాల్​ అధికార పార్టీని చీల్చే విషయంలో ప్రధాని ఓలి మొండిగా ఉన్నారని ఆరోపించారు పుష్ప దహల్ ప్రచండ. ఇరువురి మధ్య రాజకీయ విభేదాలు నెలకొన్న తరుణంలో ప్రచండ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.​

Nepal PM Oli adamant in splitting ruling communist party: Prachanda
'పార్టీని చీల్చేేందుకు ప్రధాని మొండి ప్రయత్నాలు'

By

Published : Jul 25, 2020, 5:15 AM IST

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి.. అధికార కమ్యూనిస్ట్​ పార్టీ కో-ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ మధ్య మైత్రి రోజురోజుకు క్షీణిస్తోంది. తాజాగా.. అధికార పార్టీని చీల్చే విషయంలో ప్రధాని మొండిగా ఉన్నారని ఆరోపించారు ప్రచండ. ఎన్నికల సంఘం వద్ద.. ప్రధాని తరఫున కొందరు సీపీఎన్​-యూఎమ్​ఎల్​ పార్టీని రిజిస్టర్​ చేశారని తెలిపారు. ఈ మేరకు మై రిపబ్లికా వార్తా పత్రిక కథనం ప్రచురించింది.

అధికార భాగస్వామ్య విషయం మీద ఓలిపై గతకొంత కాలంగా ఒత్తిడి పెంచుతున్న ప్రచండ.. ప్రధాని ప్రవర్తన వల్లే పార్టీ సంక్షోభంలో పడిందని ఆరోపించారు.

"మా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే.. ప్రధాని జోక్యంతో ఎన్నికల సంఘం వద్ద సీపీఎన్​-యూఎమ్​ఎల్​ పార్టీని కొందరు రిజిస్టర్​ చేశారు. దీంతో అధికార పార్టీ సంక్షోభంలో పడింది. పార్టీని విభజించేందుకు ఓలి మొండిగా ఉన్నారు."

--- పుష్ప దహల్​ ప్రచండ, ఎన్​సీపీ కో-ఛైర్మన్​.

ఇదీ చూడండి:-ఓలి-ప్రచండ మధ్య రాజీకి ఎన్​సీపీ విఫలయత్నం

భారత్​తో బలహీనపడుతున్న సంబంధాల నేపథ్యంలో ప్రధాని ఓలిపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఓలి రాజీనామా చేయాలని ప్రచండ సహా పలువురు సీనియర్​ నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలి-ప్రచండ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమదిసార్లు భేటీ అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details