పార్లమెంట్ రద్దు!
నేపాల్ పార్లమెంట్ రద్దుకు ప్రధాని సిఫారసు!
11:17 December 20
నేపాల్ పార్లమెంట్ రద్దుకు ప్రధాని సిఫారసు!
నేపాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరిగింది. ఆదివారం జరిగిన ఓ అత్యవసర సమావేశంలో.. నేపాల్ పార్లమెంట్ రద్దుకు ఆ దేశ ప్రధాని కేపీ ఓలి సిఫారసు చేసినట్టు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. మంత్రి మండలితో చర్చించిన అనంతరం ఓలి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్పకుమార్ దహాల్ ప్రచండతో తలెత్తిన వివాదం తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఓలి ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పార్లమెంట్ రద్దు నిర్ణయానికి అనుమతులు పొందేందుకు రాష్ట్రపతి విద్యా దేవీ భండారీకి పంపించనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నేపాల్ మంత్రిమండలి నిర్ణయాన్ని అధికార పార్టీ నేత నారాయణ్కాజీ తప్పుబట్టారు. మంత్రులందరూ లేకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇది దేశ అభివృద్ధికి నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు.