నేపాల్లో కురుస్తోన్న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి ఆదివారం మరో 10 మంది మృత్యుఒడికి చేరారు. మూడు రోజులుగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 54 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. అలాగే తూర్పు శంఖువాసభ జిల్లాలో కొండచరియాలు విరిగిపడి 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 11 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి - నేపాల్ కొండచరియాలు విరిగిపడి 32 మంది మృతి
నేపాల్లో కొండచరియలు విరిగిపడి ఈరోజు 10 మంది మృతి చెందారు. మూడు రోజుల నుంచి ఇలాంటి ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 40 మంది వరకు గాయపడ్డారు.
కొండ చరియలు విరిగిపడి 11 మంది గల్లంతు
సిసువాఖోలా ప్రాంతం బెసిండా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సైనిక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. పలు రహదారులు దెబ్బతినగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి కారణంగా నారాయణి నది, ఇతర ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇదీ చూడండి:గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్పై విచారణకు కమిషన్
Last Updated : Jul 12, 2020, 9:41 PM IST