నేపాల్ ప్రభుత్వం తమ దేశ పటాన్ని మార్చాలనే లక్ష్యంతో ఆదివారం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. భారత్తో సరిహద్దు వివాదాన్ని కావాలని రాజేస్తున్న నేపాల్ తాజాగా ఈ దుందుడుకు చర్యకు దిగింది.
నేపాల్ ప్రభుత్వం తరఫున న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ తుంబహాంగ్ఫే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే... నేపాల్ చేసిన రెండో రాజ్యాంగ సవరణ అవుతుంది.
వ్యూహాత్మకంగా కీలకమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమ దేశ రాజకీయ పరిపాలనా పటంలో చేర్చింది నేపాల్. ఈ కొత్త పటాన్ని ఆ దేశ క్యాబినెట్ కూడా ఆమోదించింది.