తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ చేరిన 10 లక్షల కొవిషీల్డ్​ టీకాలు - సీరం టీకా నేపాల్​

పుణెలోని సీరమ్​ సంస్థ తయారు చేసిన పది లక్షల కొవిషీల్డ్​ టీకాలు నేపాల్​కు చేరాయి. వాటిని ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానంలో బట్వాడా చేసినట్లు భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

Nepal gets 1 mn doses of COVID-19 vaccine bought from India
నేపాల్​ చేరిన 10 లక్షల కొవిషీల్డ్​ టీకాలు

By

Published : Feb 21, 2021, 10:45 PM IST

సీరమ్​ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ నేపాల్​కు చేరింది. ఆదివారం ఉదయం భారత్​ నుంచి టీకాలను తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా విమానం త్రిభువన్​ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరినట్లు భారత దౌత్య కార్యాలయం అధికారులు తెలిపారు. సమారు పది లక్షల వ్యాక్సిన్​లు అందినట్లు పేర్కొన్నారు.

మొత్తంగా 20 లక్షల వ్యాక్సిన్లను పుణెలోని సీరం సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నేపాల్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భారత్​ మరో పది లక్షల డోసులను నేపాల్​కు బహుమతిగా ఇచ్చింది. మొదటి ప్రాధాన్యంగా టీకాను ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులకు ఇస్తోంది నేపాల్​. త్వరలో వృద్ధులకు కూడా టీకాను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నేపాల్​ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'కొవిషీల్డ్‌' టీకాకు నేపాల్ అత్యవసర‌ అనుమతి

ABOUT THE AUTHOR

...view details