తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ అధికార 'ఎన్​సీపీ'కి ఎన్నికల సంఘం షాక్​! - నేపాల్ రాజకీయ సంక్షోభం

నేపాల్​​ కమ్యూనిస్ట్​ పార్టీ(ఎన్​సీపీ)లో రెండుగా చీలిన ఏ వర్గానికీ చట్టబద్ధత కల్పించలేమని ఆ దేశ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇరు వర్గాలు పొలిటికల్​ పార్టీస్​ యాక్ట్-2017 నిబంధనలను పాటించలేదని దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్​సీపీలో ఒక వర్గానికి ప్రధాని ఓలి నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గానికి దహాల్, నేపాల్​లు అధినేతలుగా ఉన్నారు.

Nepal Election Commission refuses to give legitimacy to either faction of ruling NCP
'ఎన్​సీపీలో ఏ వర్గానికీ చట్టబద్ధత లేదు'

By

Published : Jan 25, 2021, 4:22 PM IST

నేపాల్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ .. రెండుగా చీలిన నేపాల్​ కమ్యూనిస్ట్ పార్టీలో వర్గాలకు చట్టబద్ధత కల్పించేందుకు నేపాల్​ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఇరు వర్గాలు పొలిటికల్​ పార్టీస్ యాక్ట్​-2017కు అనుగుణంగా వ్యవహరించలేదని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. పార్టీ గుర్తు 'ది సన్​' తమదంటే తమదంటూ ఇరు వర్గాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

"పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఇరు వర్గాలు నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమయ్యాయి. అందువల్ల పార్టీ వివరాలను మేము పొందుపరచలేము. మేము ఇదే విషయాన్ని ఇరు వర్గాల నేతలు కేపీ శర్మ ఓలి, పుష్ప కమల్​ దహల్​లకు వివరించాం."

-రాజ్​కుమార్​ శ్రేష్ఠ , నేపాల్​ ఎన్నికల సంఘం ప్రతినిధి

ప్రధాని కేపీ శర్మ ఓలి లోక్​సభను రద్దు చేసిన తర్వాత.. డిసెంబర్​ 22న నేపాల్​ కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలింది. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం పార్టీ రెండుగా చీలినా.. సాంకేతికపరంగా, న్యాయపరంగా ఒకే పార్టీగా ఉన్నాయని పేర్కొంది.

ఇదీ చదవండి :ఓలిని పార్టీ నుంచి తొలగించిన ఎన్​సీపీ

నేపాల్ పార్లమెంటు రద్దు- వేసవిలో ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details