తెలంగాణ

telangana

ETV Bharat / international

సిరియా ఘర్షణల్లో 2 రోజుల్లోనే 70 మంది మృతి - సిరియాలో ప్రభుత్వ దళాలు సాయుధ బలగాలు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలో సుమారు 70 మంది మరణించారు

సిరియాలో ప్రభుత్వ దళాలు, సాయుధ బలగాలు మధ్య జరుగుతున్నఘర్షణలతో రెండు రోజుల్లోనే సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో మిగిలిపోయిన చివరి ప్రాంతం ఇడ్లిబ్‌ మీద పట్టుసాధించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది.

syria
సిరియాలో మళ్ళీ తీవ్ర యుద్ధం...70మంది బలి

By

Published : Dec 2, 2019, 6:20 AM IST

సిరియాలో ప్రభుత్వ దళాలు, సాయుధ బలగాలు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలో సుమారు 70 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 36 మంది ప్రభుత్వ దళాల సభ్యులు ఉన్నారు.

సిరియాలోని మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. నెలరోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ దాడులు బలహీనపరిచాయని తెలిపింది. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు. అత్యంత హింసాత్మకంగా మారుతున్నాయని, మానవ హక్కుల పరిశీలన సంస్థ హెడ్​ రామి అబ్దుల్ రెహ్మాన్ తెలిపారు. మారెట్ అల్-నుమాన్ ప్రాంతంపై ప్రభుత్వ దళాలు భీకర దాడులు జరపడంతో.. నగరం మొత్తం పొగ కమ్ముకుంది.

రష్యన్ యుద్ధ విమానాల మద్దతుతో సిరియా సైన్యం పట్టు కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందటానికి ఈ దాడులు చేస్తోంది.

ఇదీ చూడడి : వరుసగా మూడోరోజు పాక్​ కవ్వింపు చర్యలు

ABOUT THE AUTHOR

...view details