తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా కార్చిచ్చుకు 300 కోట్ల జీవులు బలి! - ఆస్ట్రేలియా కార్చిచ్చుకు కోట్లు మూగజీవాలు మృతి

గత ఏడాది ఆస్ట్రేలియా అడవుల్లో చెలరేగిన మంటల కారణంగా దాదాపు 300 కోట్ల వన్యప్రాణులు మృతి చెందటం లేదా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు పరిశోధకులు తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం మంటల్లో చిక్కుకుని మరణించగా, మిగిలినవి ఆహారం దొరకక చనిపోయి ఉంటాయని వెల్లడించారు.

Nearly 3 billion animals killed or displaced in Aus bushfires: WWF study
ఆస్ట్రేలియా కార్చిచ్చుకు 300 కోట్ల వన్యప్రాణులు బలి

By

Published : Jul 28, 2020, 6:27 PM IST

2019-20 మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు 300 కోట్ల జంతువులు మృతి చెందటం, లేదా మరొక ప్రాంతానికి తరలి వెళ్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది జనవరిలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్యూడబ్యూఎఫ్​)​ విడుదల చేసిన గణాంకాల సంఖ్య 1.2 బిలియన్​ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావటం గమనార్హం.

సిడ్నీ విశ్వవిద్యాలయం, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం, న్యూకాజిల్ విశ్వవిద్యాలయం, చార్లెస్ స్టువర్ట్ విశ్వవిద్యాలయం, బర్డ్ లైఫ్ ఆస్ట్రేలియాకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఈ ప్రాజెక్ట్​కు సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన లిల్లీ వాన్​ ఈడెన్​ అధ్యక్షత వహించారు.

చనిపోయిన మూగజీవాల్లో దాదాపు 143 మిలియన్ల పాలు ఇచ్చే జంతువులు, 2.46 మిలియన్ల సరీసృపాలు, 180 మిలియన్ల పక్షులు, 51 మిలియన్ కప్పలు ఉన్నట్లు డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ తన నివేదికలో పేర్కొంది. కార్చిచ్చు ప్రమాదాలపై ఇలా పరిశోధన చేయటం ప్రపంచంలో ఇదే మొట్టమొదటి సారి అని పరిశోధకులు తెలిపారు.

"ఈ ఫలితాలు చాలా ఆశ్చర్యకరమైనవి. ప్రపంచంలో మరెక్కడా కూడా ఈ విధంగా జంతువులు చనిపోవటం కానీ, మరొక చోటుకు తరలి వెళ్లటం కానీ జరిగి ఉండదు. ఈ ఆధునిక ప్రపంచంలో అతి పెద్ద వన్యప్రాణుల విపత్తుగా దీనిని చెప్పవచ్చు."

-డెర్మోట్ ఓ'గార్మాన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ ఆస్ట్రేలియా సీఈఓ.

మంటల్లో చిక్కుకుని ఎన్ని జంతువులు చనిపోయాయో కచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆహారం, ఉండటానికి నివాసం లేక కూడా చాలా మూగజీవాలు చనిపోయి ఉంటాయని వారు అంచనా వేశారు.

ఈ ప్రాజెక్ట్ కోసం మంటల్లో కాలిపోయిన 11.46 మిలియన్ హెక్టార్ల ప్రాంతాన్ని బృందం పరిశీలించిందని వాన్ ఈడెన్ తెలిపారు.

ఇదీ చూడండి:'అయోధ్యలో టైమ్​ క్యాప్సుల్ వార్తలు అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details