తెలంగాణ

telangana

ETV Bharat / international

మృత్యువుతో నవాజ్​ షరీఫ్​ పోరాటం: వైద్యులు - Nawaz Sharif fighting for life: doctor

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండెపోటు నియంత్రణకు వాడే మందుల కారణంగా ఆయన రక్తంలో ప్లేట్​లెట్స్​ తగ్గిపోయాయని షరీఫ్​ వ్యక్తిగత వైద్యబృందం వెల్లడించింది. పనామా పత్రాల కేసులో జైలులో ఉన్న నవాజ్​కు కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం

By

Published : Oct 29, 2019, 4:51 PM IST

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య భారీగా తగ్గడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. పనామా పత్రాల కేసులో జైలులో ఉన్న షరీఫ్​ను.. ఆరోగ్యం క్షీణించిన కారణంగా సోమవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. గతంలో నవాజ్‌కు గుండెపోటు వచ్చినప్పటి నుంచి ఆయన మందులు వాడుతున్నారు. ఆ మందుల వాడకం వల్లే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోయినట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఆ ఔషధాలు వాడడాన్ని నిలిపేశారు.

షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. బతికేందుకు పోరాడుతున్నారని.. ప్లేట్​లెట్స్ పడిపోవడం, గుండెపోటు కారణంగా మూత్రపిండాల పనితీరు క్షీణించిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ వెల్లడించారు. రక్తంలో ఇన్సులిన్ స్థాయి తక్కువగా ఉండటం, రక్తపోటులో క్షీణత వల్ల తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు.

షరీఫ్​తో పాటు...

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్‌ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ.. కోర్టు అనుమతి పొందాల్సి ఉందని ఆయన సోదరుడు షబాజ్‌ తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్‌ ప్రస్తుతం జైలులో ఉన్నారు. మరో మాజీ ప్రధాని అబ్బాసీ కూడా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన కూడా ఓ అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నారు.

ఇదీ చూడండి: ఆ సీఎం కొరడా దెబ్బలు తిన్నారు.. ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details