భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాలు బంగాళఖాతంలో 'బంగోసాగర్' పేరిట భారీ సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో రెండు రోజులు జరగనున్న ఈ నౌకాదళ విన్యాసాలు.. ఇవాళ నుంచే ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 4-5 తేదీల మధ్య మూడో దఫా సమన్వయ పాట్రోల్ 'కార్పాట్' విన్యాసాలను అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు ప్రాంతంలో చేపట్టనున్నాయి. బంగోసాగర్, ఇండోబంగ్లా కార్పాట్ మూడోదఫా విన్యాసాలు ముజిబూర్ రెహ్మాన్ 100వ జయంతి సందర్భంగా చేపట్టడం.. ఇరుదేశాల మధ్య కీలకంగా మారనున్నాయని పేర్కొంది భారత నౌకాదళం.