తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై అతి చేయకండి: ప్రపంచ దేశాలకు చైనా 'క్లాస్​' - carona china latest news

కరోనా వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అత్యవసర పరిస్థితి ప్రకటించిన నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వ్యాప్తిని అతిగా చూపించడం మానుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

Nations should avoid 'overreaction', says China as WHO declares global emergency over coronavirus
కరోనా వైరస్​పై బాధ్యతగా వ్యవహరించాలి: చైనా

By

Published : Jan 31, 2020, 4:49 PM IST

Updated : Feb 28, 2020, 4:24 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్​ఓ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన... చైనా వాణిజ్యం, రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అమెరికా కూడా తమ దేశ పౌరులను చైనా వెళ్లొద్దంటూ ఆదేశించింది. ఈ క్రమంలో ఐరాసలోని చైనా రాయబారి జాంగ్ జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైరస్​ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు జాంగ్ జున్. అతిగా చూపించడం చైనాకు ప్రతికూల చర్యగా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్​ను అడ్డుకోవడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలన్నారు.

"కరోనా వైరస్​పై పోరాడే క్రమంలో మేము చాలా క్లిష్టమైన దశలో ఉన్నాం. ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం చాలా అవసరం. వైరస్​ విషయంలో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తిపై ప్రపంచ దేశాల ఆందోళనను చైనా అర్థం చేసుకుంది. అయితే వాణిజ్యాన్ని పరిమితం చేసే అధికారం డబ్ల్యూహెచ్​ఓకు లేదు."

-జాంగ్ జున్, యూఎన్ చైనా రాయబారి

చైనాలో ఇప్పటివరకు 9,692మంది వైరస్​ బారిన పడగా.. 213 మంది మృతి చెందారు. ఇతర 18 దేశాల్లో 98 మందికి మహమ్మారి సోకగా.. ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. వీరిలో ఎక్కువ మంది వైరస్​ పుట్టిన వుహాన్​ పట్టణానికి ఏదో విధంగా అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం.

Last Updated : Feb 28, 2020, 4:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details