ఆస్ట్రేలియాను చిదిమేస్తున్న కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగ.. ప్రపంచాన్ని చుట్టేసినట్లు నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) తెలిపింది. అనంతరం తూర్పు ఆస్ట్రేలియా మీద ఈ పొగ తిరిగి అలుముకున్నట్లు వెల్లడించింది. శాటిలైట్ ద్వారా పొగ ఏ దిశగా పయనిస్తోందో గుర్తించినట్లు పేర్కొంది నాసా. అసాధారణ పరిస్థితుల కారణంగా అగ్ని ప్రేరిత ఉరుములు సంభవించినట్లు వివరించింది.
ప్రపంచాన్ని చుట్టిన ఆస్ట్రేలియా కార్చిచ్చు పొగ: నాసా - nasa latest news
ఆస్ట్రేలియాలో భీకర కార్చిచ్చు కారణంగా వెలువడిన దట్టమైన పొగ ప్రపంచాన్నంతా చుట్టి తిరిగి తూర్పు ఆస్ట్రేలియా మీద అలుముకున్నట్టు నాసా వెల్లడించింది. ఈ పొగ న్యూజిలాండ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు పేర్కొంది.
ప్రపంచాన్ని చుట్టిన ఆస్ట్రేలియా కార్చిచ్చు పొగ: నాసా
ఆస్ట్రేలియా కార్చిచ్చు పొగ న్యూజిలాండ్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు నాసా తెలిపింది. వాయు నాణ్యత సమస్యలూ తలెత్తినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియాలో కార్చిచ్చు.. కోలా బేర్ మనుగడకు ముప్పు?
Last Updated : Jan 15, 2020, 11:24 AM IST