కొన్ని రోజులుగా దాడులతో ఉద్రిక్తంగా మారిన నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంలో.. నూతన కాల్పుల విరమణ ఒప్పందానికి ఆర్మేనియా- అజర్‌బైజాన్ దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తాజా ఒప్పందంపై జరిపిన చర్చల్లో... ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో రెండు దేశాల మధ్య ఇది రెండో కాల్పుల విరమణ ఒప్పందం.
ఇప్పటికే ఈ నెల 10న ఆర్మేనియా- అజర్‌బైజాన్ మధ్య రష్యా నేతృత్వంలో తొలి ఒప్పందం జరిగింది. అయితే శనివారం నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంలో ఆర్మేనియా క్షిపణి దాడికి పాల్పడిందని అజర్‌బైజాన్ ఆరోపించగా.. ఆర్మేనియా ఆ వార్తలను ఖండించింది.