తెలంగాణ

telangana

ETV Bharat / international

మా విధానాలు విఫలమయ్యాయి: కిమ్​ - కీమ్​ జోంగ్​ ఉన్​ ఈటీవీ భారత్​

దేశంలో తమ విధానాలు విఫలమయ్యాయని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ అంగీకరించారు. సరికొత్త అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రణాళికలు అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పాంగ్​యాంగ్​లో జరిగిన అధికార పార్టీ కాంగ్రెస్​ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

N Korea's Kim opens congress with policy failures admission
మా విధానాలు విఫలమయ్యాయి: కిమ్​

By

Published : Jan 6, 2021, 8:50 AM IST

ఉత్తరకొరియాలో ఐదేళ్లల్లోనే తొలిసారిగా అధికార పార్టీ కాంగ్రెస్​ సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు కిమ్​ జోంగ్​​ ఉన్​.. దేశంలో తమ విధానాలు విఫలమయ్యాయని అంగీకరించారు. సరికొత్త అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని తగిన ప్రణాళికలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.

2016లో కాంగ్రెస్​ నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలు చేరుకోలేదని.. భవిష్యత్తులు దీనిని పునరావృత్తం చేయకూడదని కిమ్​ తెలిపారు. పాంగ్​యాంగ్​లో ఏర్పాటు చేసిన వర్కర్స్​ పార్టీ కాంగ్రెస్​కు హాజరైన వేలాది మంది సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:-నన్ను క్షమించండి అంటూ 'కిమ్​' కన్నీరు.!

ఎన్నో సవాళ్లు..

ఎన్నో సవాళ్లు, సంక్షోభాల మధ్య ఉత్తరకొరియాలో ఈసారి కాంగ్రెస్​ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా దేశ సరిహద్దులు మూతపడటం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, గతేడాది సంభవించిన ప్రకృతి వైపరిత్యాలతో ఉత్తరకొరియా అతలాకుతలమైంది.

ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు కూడా కిమ్​కు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే ఉత్తరకొరియాపై ఆంక్షలతో విరుచుకుపడుతోంది అమెరికా. మరికొన్ని రోజుల్లో అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోనున్న జో బైడెన్​.. మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముండటం కిమ్​కు అత్యంత ఆందోళన కలిగించే విషయం.

ఇదీ చూడండి:-కిమ్ 'కొత్త'‌ సందేశం- 1995 తర్వాత ఇదే!

ABOUT THE AUTHOR

...view details