ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములను(U.S. nuclear submarines) అందించాలని అమెరికా నిర్ణయించటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉత్తర కొరియా(north korea criticizes US). ఇరు దేశాల మధ్య జలాంతర్గాముల(nuclear powered submarines) కొనుగోలుకు ఒప్పందం కుదిరితే అది తమ దేశ భద్రతను ప్రభావితం చేస్తుందని, అదే జరిగితే.. తగిన విధంగా ప్రతిస్పందన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ అంశంపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ప్రత్యేక కూటమిగా((AUKUS Alliance)) ఏర్పడటాన్ని అత్యంత ప్రమాదక చర్యగా అభివర్ణించారు.
"అమెరికా, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. మా దేశ భద్రతపై చిన్న ప్రతికూల ప్రభావం చూపినా.. అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతి భద్రతలను నాశనం చేస్తుంది. అంతర్జాతీయంగా సమస్యలు తలెత్తి.. సాయుధ దాడులకు దారి తీస్తుంది. ప్రస్తుత పరిస్థితులు.. దీర్ఘకాల లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే మా ప్రయత్నాలను ఏ మాత్రం తగ్గించుకోకూడదని స్పష్టం చేస్తున్నాయి. "