తెలంగాణ

telangana

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు.. లాక్​డౌన్​ విధింపు!

తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెబుతోన్న ఉత్తర కొరియాలో తొలి కొవిడ్​ అనుమానాస్పద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా సరిహద్దు నగరం కైసోంగ్​లో పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధించారు.

By

Published : Jul 26, 2020, 8:43 AM IST

Published : Jul 26, 2020, 8:43 AM IST

N Korea puts Kaesong city in lockdown
ఉత్తర కొరియాలో తొలి కేసు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. తమ దేశంలో ఒక్క కొవిడ్‌-19 కేసు నమోదు కాలేదని ప్రకటిస్తూ వస్తోన్న ఉత్తరకొరియాలో తొలి కరోనా అనుమానాస్పద కేసు నమోదైంది. కైసోంగ్‌ నగరంలోని ఓ వ్యక్తి.. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నాడని ఉత్తర కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది.

ఈ ఘటనతో కైసోంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు ఆ దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​. దేశంలోకి వైరస్​ వస్తే క్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర పరిస్థితి విధించారు.

తొలి కేసు..

చాలా ఏళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి.. సరిహద్దును అక్రమంగా దాటి మళ్లీ వచ్చాడని.. అతడికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు అధికారులు. ఈ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయితే... ఉత్తర కొరియాలో అధికారికంగా తొలి కరోనా కేసు నమోదవుతుంది. తమ దేశ భూభాగంలో ఇంతవరకూ ఒక్క కొవిడ్‌ కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా వాదిస్తున్నా.. నిపుణులు ఖండిస్తున్నారు. ఉత్తరకొరియాలో కరోనా కేసులు నమోదవుతున్నా.. బయటకు రానివ్వడం లేదని చెబుతున్నారు.

ఇదీ చూడండి: కోటి 60 లక్షలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details