తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా వైఖరితోనే అణు చర్చలు విఫలం' - kim on america

అమెరికా వైఖరి వల్లనే అణు చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిపోయాయని ఉత్తర కొరియా ఆక్షేపించింది. ఈ చర్చల్లో ఉత్తర కొరియాను సంతృప్తి పరిచే అంశాలు లేవని తెలిపింది.

కిమ్​ ట్రంప్

By

Published : Oct 6, 2019, 5:02 AM IST

Updated : Oct 6, 2019, 6:31 AM IST

అమెరికా వైఖరితోనే అణు చర్చలు విఫలం

అణు నిరాయుధీకరణ చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండా ముగియడానికి కారణం అమెరికా వైఖరేనని ఉత్తర కొరియా ఆరోపించింది. స్టాక్​హోంలో జరిగిన చర్చల్లో అమెరికా ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని తెలిపారు ఉత్తర కొరియా ప్రతినిధి కిమ్​మ్యాంగ్​ గిల్​.

"ఈ చర్చలు మాకు సంతృప్తికరంగా సాగలేదు. అందుకే ఎలాంటి పరిష్కారం లేకుండా ముగిశాయి. అమెరికా గతంలో పాటించిన వైఖరినే ఇప్పుడూ అవలంబించటమే ఇందుకు కారణం."

-కిమ్​ మ్యాంగ్ లామ్​, ఉత్తర కొరియా ప్రతినిధి

స్టాక్​ హోంలో అమెరికా దౌత్య ప్రతినిధి స్టీఫెన్​ బీగన్​తో చర్చించినట్లు లామ్ తెలిపారు. అమెరికా తనకు అనుకూలంగా ఎన్నో ప్రతిపాదించిందనీ.. అందులో తమని సంతృప్తి పరిచే ప్రణాళికలేవీ లేవన్నారు.

ఇదీ చూడండి : పీఓకే కశ్మీరీలు నియంత్రణరేఖ దాటొద్దు: ఇమ్రాన్​​

Last Updated : Oct 6, 2019, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details