తెలంగాణ

telangana

అమెరికాకు కిమ్ 'అణ్వాయుధ'​ హెచ్చరికలు

By

Published : Jan 9, 2021, 10:49 AM IST

అణ్వాయుధాలు సామర్థ్యాన్ని పెంచుకుంటామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు కిమ్​. ఉత్తరకొరియాపై అనుసరిస్తున్న కఠిన వైఖరిని అమెరికా మార్చుకునే విషయంపైనే ఇరు దేశాల మధ్య మైత్రి ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్​పై ఒత్తిడి పెంచేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Kim threatens america
అమెరికాకు కిమ్ 'అణ్వాయుధ'​ హెచ్చరికలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​.. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశ అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటామని, అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేస్తామని హెచ్చరించారు. ఇరు దేశాల బంధం.. తమపై అనుసరిస్తున్న కఠిన విధానాలను రద్దు చేసుకునే అంశంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధారిత మీడియా కథనం ప్రచురించింది.

పాంగ్​యాంగ్​లో జరుగుతున్న అధికార పార్టీ కాంగ్రెస్​ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కిమ్​. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్​పై ఒత్తిడి పెంచేందుకే కిమ్​ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శత్రువులు తమ అణ్వాయుధాలను ఉపయోగించనంత వరకు తాను కూడా ఎలాంటి ఆయుధాలను ప్రయోగించనని పేర్కొన్నారు కిమ్​. అయితే ఉత్తరకొరియాపై అమెరికా దండయాత్ర చేసే అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. అందువల్ల దేశ సైనిక శక్తిని మరింత పెంపొందించుకునే అవసరం ఉందని వెల్లడించారు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details