ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్నప్పటికీ.. తమ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని పునరుద్ఘాటించింది ఉత్తర కొరియా. ముందస్తు జాగ్రత్తలతోనే ఇది సాధ్యపడిందని చెబుతోంది.
చైనాలో కరోనా తొలి కేసు ఉద్భవించిన కొద్ది రోజులకే.. ఈ ఏడాది జనవరిలో తమ దేశ సరిహద్దులను మూసివేసినట్లు తెలిపారు ఉత్తర కొరియా అధికారులు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా పలు కఠిన ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
" మా దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ముందస్తుగా స్పందించి దేశంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పరీక్షించి క్వారంటైన్‌కు తరలించడం, సరుకులను శుద్ధిచేయడం వంటి చర్యలు చేపట్టాం. సరిహద్దులు, సముద్ర, వాయు మార్గాలను మూసేశాం. ఫలితంగా ఇప్పటివరకు మా దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు."