తెలంగాణ

telangana

ETV Bharat / international

'మా దేశంలో ఒక్క కొవిడ్ కేసు లేదు' - ఉత్తరకొరియాలో కొవిడ్

ఏప్రిల్ నుంచి తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తరకొరియా చెబుతోంది. 25,986 మందిని పరీక్షించగా ఒక్కరికీ వైరస్​ సోకలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించింది.

northkorea
ఉత్తర కొరియా

By

Published : May 11, 2021, 1:41 PM IST

ఏప్రిల్ నుంచి మొత్తంగా 25, 986 మందిని పరీక్షించినప్పటికీ తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది ఉత్తరకొరియా.

ఏప్రిల్ 23-29 మధ్యలో పరీక్షించిన 751 మందిలో 139 మందికి.. స్వల్పంగా కొవిడ్​ లక్షణాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తమ వారాంతపు నివేదికలో పేర్కొంది. వీరిలో అనారోగ్య లక్షణాలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయని స్పష్టం చేసింది.

అయితే.. ఉత్తరకొరియా కొవిడ్ కేసులపై స్పష్టత ఇవ్వడంలేదని కొందరు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాతో సరిహద్దు, ఆరోగ్య సదుపాయాలు సరిగ్గా లేకపోయినప్పటికీ ఒక్క కేసు నమోదు కాకపోవడం ఏంటని అనుమానిస్తున్నారు. కరోనా కట్టడి అంతర్గత వ్యవహారమని ఉత్తర కొరియా చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

కొవిడ్ లక్షణాలు ఉన్న వేల మందిని క్వారంటైన్​లో ఉంచినట్లు కొరియా పేర్కొంది. కానీ.. ప్రస్తుతం క్వారైంటన్​ లాంటివి ఏమీ ఉండవని తెలిపింది. గతంలోనూ తమ దేశంలో ఒక్క కేసు నమోదు కాలేదని కొరియా వెల్లడించింది.

ఇదీ చదవండి:గ్రహశకలం నమూనాలతో భూమికి తిరుగు పయనం

ABOUT THE AUTHOR

...view details