తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్​ - మిజోరం చాంపాయ్​ జిల్లా డిప్యూటీ కమిషనర్​కు మయన్మార్​ లేఖ

మయన్మార్​ నుంచి పారిపోయి వచ్చి మిజోరంలో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను అప్పగించాలని భారత్​ను ఆ దేశం కోరింది. ఈ మేరకు చాంపాయ్​ జిల్లా డిప్యూటి కమిషనర్​కు మయన్మార్​ అధికారి ఒకరు లేఖ రాశారు.

Myanmar urges India to send back cops
ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్​

By

Published : Mar 7, 2021, 10:37 AM IST

మయన్మార్​ నుంచి తప్పించుకుని వచ్చి మిజోరం​లో తలదాచుకుంటున్న 8 మంది పోలీసులను వెంటనే అప్పగించాలని ఆ దేశం కోరింది. ఈ మేరకు చాంపాయ్​ జిల్లా డిప్యూటీ కమిషనర్​కు మయన్మార్​ అధికారి లేఖ రాశారు. మయన్మార్​తో 510 కి.మీ.ల మేర మిజోరామ్​కు సరిహద్దు ఉంది. ఇటీవల ఆ 8 మంది తమ దేశం నుంచి పారిపోయి వచ్చారని, వారిని నిర్బంధించి తమకు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు.

చాంపాయ్​ జిల్లా డిప్యూటి కమిషనర్​కు మయన్మార్​ అధికారి రాసిన లేఖ

కాగా.. శుక్రవారం మయన్మార్​ నుంచి 16 మంది వచ్చారని, వారిలో 11 మంది తాము పోలీసులమని చెప్పినట్లు మిజోరామ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తం పరిస్థితిని కేంద్ర హోం శాఖకు నివేదించామని.. అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు.

ఇదీ చూడండి:'మయన్మార్​ సైన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details