తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు - Myanmar security forces

మయన్మార్​లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ప్రజాస్వామ్య ప్రభుత్వ మద్దతుదారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు పోలీసులు. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

Myanmar security forces disperse anti-coup protesters
మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు

By

Published : Feb 26, 2021, 6:15 PM IST

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్ధృతంగా మారుతున్నాయి. ప్రధాన నగరాలైన యాంగూన్‌, మాండలే‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపింగ్ మాల్స్​ ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఆందోళన చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. దీంతో నిరసకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో జలఫిరంగులు సహా భారీగా భద్రతా బలగాలను మోహరించారు సైన్యాధికారులు.

ర్యాలీ నిర్వహించిన సూకీ మద్దతుదారులు
ర్యాలీ నిర్వహించిన సూకీ మద్దతుదారులు
భద్రతా బలగాలు

ఆందోళనకారులపై రాళ్ల దాడి

గురువారం.. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మద్దతుగా కొందరు, సైనిక పాలనకు మద్దతుగా మరికొందరు ఆందోళనలకు దిగడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య అనుకూలవాదులపై సైనిక పాలన మద్దతుదారులు విచక్షణరహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

సూకీ ఇంటి వద్ద ప్రార్థనలు..

సైనిక తిరుగుబాటు మొదలు.. ఇప్పటివరకు ఆంగ్​సాన్​ సూకీ బయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో 50 మంది సూకీ మద్దతుదారులు యాంగూన్​లోని ఆమె ఇంటి ఎదుట ప్రార్థనలు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details