తెలంగాణ

telangana

ETV Bharat / international

గుడ్లు, పూలతో మయన్మార్​లో నిరసనలు - మయన్మార్​లో గుడ్లపై పెయింటింగ్స్​

సైనిక పాలనకు వ్యతిరేకంగా మయన్మార్​ ప్రజలు.. ఆదివారం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. పెయింటింగ్​ వేసిన గుడ్లను చేతపట్టుకుని, నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సైన్యం చేతిలో బలైన వారికి పలుచోట్ల పూలుజల్లి నివాళులు అర్పించారు.

Myanmar protesters carry eggs in Sunday demo
గుడ్లు, పూలతో మయన్మార్​ నిరసనకారులు

By

Published : Apr 5, 2021, 9:11 AM IST

మయన్మార్​లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సైనిక ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతున్నా వెనక్కి తగ్గడం లేదు. యాంగూన్​లో ఈస్టర్​ హాలిడే ఆదివారం నాడు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. పెయింటింగ్​ వేసిన గుడ్లను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ, నిరసన గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు.

మయన్మార్​లో గుడ్లు, పూలతో నిరసనలు

గుడ్లపై వివిధ రంగులతో రకరకాల పెయింటింగ్​లు వేశారు. పలు నినాదాలు రాశారు. మూడు వేళ్లతో సెల్యూట్​ చిత్రాలు వేశారు. పూలతోనూ నిరసన తెలిపారు. భద్రతా దళాల దాష్టీకానికి బలైపోయినవారికి నివాళులర్పిస్తూ పలుచోట్ల పూలుజల్లారు. మాండలే నగరంలో ఉదయం ద్విచక్రవాహనాలపై వచ్చిన ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు భద్రతా దళాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. ప్యిన్​మనాలో ఆందోళన చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం వల్ల ఒకరు చనిపోయారు.

ఇదీ చూడండి:మయన్మార్​లో​ హింసను ఖండించిన భారత్

ABOUT THE AUTHOR

...view details