మయన్మార్‌లో ఆందోళనలకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. సైన్యం కాల్పుల్లో ఇప్పటివరకు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి న్యాయవాదులు, మీడియా విడుదల చేసిన డేటాలో తేలింది. వారిలో తుపాకీతో కాల్చడం వల్లే 90 శాతం మంది చనిపోయారని వివరించింది. మృతుల్లో 36శాతం మంది 24 ఏళ్లలోపు వయస్సు వారేనని పేర్కొంది.
మార్చి 25 నాటికి 320 మంది చనిపోయారని ఏఏపీపీ గ్రూప్ వెల్లడించింది. 3 వేల మందిని సైనిక ప్రభుత్వం అరెస్టు చేసిందని పేర్కొంది. అయితే.. ఆందోళనల్లో 164 మంది నిరసనకారులు, 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు సైనిక ప్రభుత్వం తరఫు ప్రతినిధి చెప్పారు.