సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో మయన్మార్ అట్టుడుకుతోంది. నిరసనలపై ఆంక్షలు విధించినప్పటికీ.. దేశంలోని ప్రధాన నగరాల్లో పౌర ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి.
సూకీ విడుదలకు పట్టు..
రాజధాని నేపీడాలో నిరసన ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ.. వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నిర్భందంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీ, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు. జల ఫిరంగులు, బాష్ప వాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.
అణచివేత ధోరణి..
ప్రజా ఆందోళనలు తీవ్రరూపం దాల్చగా.. సైన్యం అణచివేతకు పూనుకుంది. దేశంలోని పలు నగరాల్లో బహిరంగ సభలపై నిషేధం సహా.. రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఎవరూ చట్టానికి అతీతులు కారని.. ఉల్లంఘించినవారిపై చర్యలుంటాయని మిలటరీ అధ్యక్షుడు 'మిన్ ఆంగ్ హ్లయింగ్' హెచ్చరించారు. మాండలే నగరంలో పోలీసు కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి చేశారు. సైన్యం అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నందునే ఘర్షణలు తలెత్తుతున్నాయని ఆందోళనకారులు తెలిపారు.
న్యూజిలాండ్ కీలక నిర్ణయం..