తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 34 మంది మృతి - rains

మయన్మార్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మోన్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. మరో 80 మంది గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

By

Published : Aug 10, 2019, 12:06 PM IST

Updated : Aug 10, 2019, 4:27 PM IST

మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి
భారీ వర్షాలకు తూర్పు మయన్మార్​లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి 34 మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరో 80 మంది ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

మోన్ రాష్ట్రంలోని థే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 ఇళ్లు, ఒక ఆశ్రమం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

" ఇప్పటి వరకు 34 మృతదేహాలు లభించాయి. మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది."

- స్థానిక అధికారి.

రహదారిపై 1.8 మీటర్ల మేర బురద

కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. యాంగోన్-మావ్లామైన్ మధ్య రహదారి మూసుకుపోయింది. సుమారు 1.8 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి.

మయన్మార్​లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 89 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

ఇదీ చూడండి: 'పర్యావరణ సంరక్షణ'కై స్విట్జర్లాండ్​ వాసుల నిరసన బాట

Last Updated : Aug 10, 2019, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details