తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​ నిరసనల్లో 91కి చేరిన మృతులు

మయన్మార్​లో ఆర్మీ దినోత్సవం రోజున ఆందోళనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపింది. నిరసన కారులపై సైన్యం జరిపిన హింసాకాండలో ఒక్కరోజులోనే ప్రజలు పదుల సంఖ్యలో మృతి చెందినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 91కి చేరినట్లు తెలిపింది.

Myanmar forces kill dozens in deadliest day since coup
మయన్మార్​ నిరసనల్లో 91 కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Mar 27, 2021, 6:51 PM IST

మయన్మార్​లో ఆందోళనకారులపై సైన్యం అణచివేత ధోరణి కొనసాగుతోంది. మయన్మార్ 76వ ఆర్మీ దినోత్సవం రోజున.. పదుల సంఖ్యలో పౌరులను హతమార్చింది సైన్యం. మొత్తం మీద.. ఇప్పటి వరకు సైన్యం చేతిలో మృతిచెందిన వారి సంఖ్య 91కి చేరిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

మయన్మార్​లోని యూరోపియన్​ యూనియన్​ బృందం తీవ్రంగా స్పందించింది. 76వ మయన్మార్​ ఆర్మీ దినోత్సవం రోజున దేశ పౌరులను, పిల్లలను చంపటాన్ని ఖండించింది.

మయన్మార్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది సైన్యం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు.

ఇదీ చదవండి :ఆ దేశంలో శునకాలు-అశ్వాలకు పింఛన్​!

ABOUT THE AUTHOR

...view details