మయన్మార్‌లో స్వీయపాలిత ప్రాంత మాజీ నేత కాన్వాయ్‌పై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మృతిచెందారు. వీరిలో 9 మంది పౌరులు, ముగ్గురు పోలీసులు ఉన్నట్టు సమాచారం. ఘటనలో మరో 13 మందికి గాయాలయ్యాయి.
మయన్మార్‌లో సాయుధ దాడి- 12 మంది మృతి - మయన్మార్ మాజీ ప్రభుత్వనేత కాన్వాయ్‌పై దాడి
మయన్మార్‌లో స్వీయపాలిత ప్రాంత మాజీ నేతపై సాయుధ బలగాలు జరిపిన దాడిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది గాయపడ్డారు.
మయన్మార్ సైనిక దాడిలో 12 మంది మృతి
మయన్మార్ దేశ కేంద్ర మాజీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, స్వీయపాలిత ప్రాంత నేత యు ఖిన్ మాంగ్ ల్విన్‌కు చెందిన కాన్వాయ్.. 20 మంది మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ(ఎంఎండీఏఏ) సభ్యులతో లాషియో నుంచి లౌక్కైకు వెళ్లే క్రమంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 13 మంది(ఐదుగురు పోలీసులు, ఎనిమిది మంది పౌరులు) క్షతగాత్రులయ్యారు.
ఇదీ చదవండి:'మమ్మల్నే మయన్మార్ ప్రభుత్వంగా గుర్తించండి'