ముంబయి దాడుల సూత్రధారి, లష్కర్-ఏ-తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015 నుంచి బెయిల్పై ఉన్న అతడిని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) జనవరి 2న అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడనే నేరం కింద న్యాయస్థానం తాజాగా దోషిగా ప్రకటించినట్లు ఓ అధికారి తెలిపారు.
ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు - లఖ్వీ
ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు విధించింది పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడని ఇతడిపై ఆరోపణలున్నాయి.
ముంబయి దాడుల సూత్రధారి లఖ్వీకి 15 ఏళ్ల జైలు
లఖ్వీకి మూడు కేసుల్లో.. ఐదేళ్ల కారాగార శిక్షతోపాటుగా లక్ష రూపాయల(పాక్ కరెన్సీ)ను జరిమానాగా విధిస్తూ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ బుట్టార్ తీర్పు వెలువరించారు. మూడు కేసుల్లో జరిమానాను చెల్లించకపోతే.. మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. అయితే.. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని లఖ్వీ.. కోర్టుకు తెలిపాడు.
Last Updated : Jan 8, 2021, 5:10 PM IST