తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉగ్ర నరమేధానికి 49 మంది బలి - ఆస్ట్రేలియా

న్యూజిలాండ్​ మసీదులపై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది పౌరులు మరణించారు. ఈ దారుణ మారణకాండకు తమ దేశానికి చెందిన ఓ ఉగ్రవాదే కారణమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​మోరిసన్​ ధ్రువీకరించారు.

ఉగ్ర నరమేధానికి 40మంది బలి

By

Published : Mar 15, 2019, 1:01 PM IST

Updated : Mar 15, 2019, 3:15 PM IST

ఉగ్ర నరమేధానికి 49 మంది బలి
మసీదులపై జరిగిన ఉగ్రదాడితో న్యూజిలాండ్​ చిగురుటాకులా వణికిపోయింది.​ క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదుల వద్ద ఉగ్రదాడిలో 49 మంది మరణించారు. ఈ విషాద ఘటనను న్యూజిలాండ్​ ప్రధాని జసిండా ఆర్డెర్న్​ "దేశ​ చరిత్రలో మరో చీకటి రోజు"గా అభివర్ణించారు. ఈ ఘటనను జసిండా తీవ్రంగా ఖండించారు.

మసీదుల్లో కాల్పులకు పాల్పడింది తమ దేశానికి చెందిన ఉగ్రవాదేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​మోరిసన్ ధ్రువీకరించారు. న్యూజిలాండ్​ పోలీసులు ఘటనా స్థలంలో దుండగులు అమర్చిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు పురుషులతో పాటు ఓ మహిళ ఉండటం గమనార్హం. వీరిని పోలీసులు విచారిస్తున్నారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. బాధితుల బంధువుల కోసం హెల్ప్​లైన్ ఏర్పాటు చేశారు. అయితే దుండగులు పేలుడు పదార్థాలు అమర్చినందున ఎవరూ ఘటనా స్థలానికి రావద్దని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ జరిగింది..

శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రార్థనల కోసం ప్రజలు మసీదుకు వచ్చారు. అదే అదునుగా దుండగుడులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో చాలా మంది మరణించినట్లు, క్షతగాత్రులైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంకా అధికారికంగా మృతుల సంఖ్య, ఇతర వివరాలు తెలియరాలేదు.

బంగ్లాదేశ్​ క్రికెటర్లు సురక్షితం...

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రార్థన కోసం మసీదుకు వెళ్లారు. కాల్పుల సమయంలో వారు బస్సులో ఉండడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు.

ఈ భయానక సంఘటన వల్ల న్యూజిలాండ్​, బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ రద్దు అయ్యింది.

అరుదైన ఘటనే..

న్యూజిలాండ్​లో ఇలాంటి మారణహోమాలు జరగడం చాలా అరుదు. 1992లోనే గన్ లైసెన్స్​ నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. అయితే 16 సంవత్సరాల వయస్సు దాటిన ఎవరైనా స్వీయరక్షణ కోసం గన్​ లైసెన్స్​ పొందేవీలుంది.

1994లో మతిస్థిమితంలేని ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాని తర్వాత ఇదే అంత పెద్ద కాల్పుల ఘటన.

Last Updated : Mar 15, 2019, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details