తాలిబన్లు అపహరించిన వారిలో ఉన్న భారతీయులు సురక్షితమని అధికారిక వర్గాలు తెలిపాయి. కాసేపు ప్రశ్నించిన తర్వాత వారందరినీ కాబుల్ విమానాశ్రయం(Kabul Airport) వెళ్లేందుకు తాలిబన్లు అనుమతించారని పేర్కొన్నాయి. తాలిబన్లు వారికి ఆహారం కూడా అందించినట్లు స్పష్టం చేశాయి.
Afghan news: తాలిబన్లు కిడ్నాప్ చేసిన భారతీయులు సేఫ్! - భారతీయుల అపహరణ
12:46 August 21
తాలిబన్లు కిడ్నాప్ చేసిన భారతీయులు సురక్షితం!
ఏం జరిగిందంటే..
కాబుల్ విమానాశ్రయ సమీపం నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు(afghan taliban) కిడ్నాప్ చేసినట్లు వార్తలొచ్చాయి. అఫ్గాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నవారిని నిర్బంధించారు. వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ వెంటనే అప్రమత్తమైంది.
అయితే అపహరణకు గురైన భారతీయులకు తాలిబన్ల నుంచి ఏ ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించినట్లు చెప్పాయి.
మరోవైపు భారత వైమానిక విమానం సీ-130 కాబుల్ నుంచి కొద్ది గంటల క్రితం 85 మంది భారతీయుల్ని తరలించింది. ఆ విమానం తజకిస్థాన్‌లోని దుషన్‌బేలో సురక్షితంగా ల్యాండ్ అయింది.