తెలంగాణ

telangana

జోక్యంపై ఆధారాలు చూపని అగ్రరాజ్యం: రష్యా

By

Published : Apr 19, 2019, 7:16 PM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందన్న మ్యూలర్​ నివేదికను తోసిపుచ్చింది పుతిన్​ సర్కారు​. ఆధారాలు చూపటంలో అగ్రరాజ్యం విఫలమైందని పేర్కొంది.

జోక్యంపై ఆధారాలు చూపని అగ్రరాజ్యం: రష్యా

జోక్యంపై ఆధారాలు చూపని అగ్రరాజ్యం: రష్యా

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ప్రయత్నించిందన్న ఆరోపణల్ని మరోమారు తోసిపుచ్చింది పుతిన్​ ప్రభుత్వం. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్​ మ్యూలర్​ సమర్పించిన నివేదికను తప్పుబట్టింది.

"అమెరికా ఎన్నికల ప్రక్రియలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై మ్యూలర్​ నివేదిక ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. అందులో కొత్త సమాచారమేమీ లేదు. అమెరికా-రష్యా ద్వైపాక్షిక బంధంపై ఈ పత్రాలు నేరుగా ప్రభావం చూపుతాయని చింతిస్తున్నాం."
- దిమిత్రి పెస్కోవ్​, రష్యా ప్రభుత్వ ప్రతినిధి

ఎలాంటి ఫలితంలేని దర్యాప్తు కోసం తమ డబ్బులు ఎందుకు ఖర్చు చేశారో అమెరికా పన్ను చెల్లింపుదారులు నిలదీయాలని సూచించారు పెస్కోవ్​.

ఇదీ చూడండి:మరే అధ్యక్షుడికీ ఇలా జరగకూడదు : ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details