చైనాలోని షాన్సీ రాష్ట్రంలో కరోనా బాధితురాలైన 33 ఏళ్ల మహిళ ఎలాంటి వైరస్ సోకిన లక్షణాలు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జియాన్లోని ఓ ఆసుపత్రిలో 2.7 కిలోల బరువుతో పుట్టిన పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చిన్నారికి కరోనాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా.. వైరస్ సోకలేదని తేలింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వైరస్ లేకపోవడాన్ని నిర్ధరించేందుకు పాపకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.