తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూజిలాండ్​ నరమేధం నిందితుడిపై 89 కేసులు

న్యూజిలాండ్​లోని క్రైస్ట్​చర్చ్, లిన్​మోర్ మసీదులపై కాల్పులకు తెగబడి మారణహోమం సృష్టించిన నిందితుడిపై 89 కేసులు నమోదు చేశారు పోలీసులు. అందులో 50 హత్యా నేరం, 39 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. శుక్రవారం రెండోసారి విచారణకు.. వీడియో లింక్​​ ద్వారా కోర్టులో హాజరుపరచనున్నారు.

By

Published : Apr 4, 2019, 4:49 PM IST

న్యూజిలాండ్​ నరమేధం నిందితుడిపై 89 కేసులు

న్యూజిలాండ్​ నరమేధం నిందితుడిపై 89 కేసులు
మార్చి 15న న్యూజిలాండ్​లోని క్రైస్ట్​చర్చ్​, లిన్​మోర్​ మసీదులపై కాల్పులకు తెగబడిన నిందితునిపై చర్యలు చేపట్టారు పోలీసులు. శుక్రవారం రెండోసారి కోర్టుకు హాజరుపరచనున్న నేపథ్యంలో మొత్తం 89 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందులో 50 హత్యానేరం, 39 హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు.

శుక్రవారం రోజు విచారణకు నిందితుడు బ్రెంటన్​ టారంట్​​ను వీడియో లింక్​ ద్వారా హాజరుపరచనున్నారు.

గత నెలలో రెండు మసీదులపై జరిగిన హింసకాండలో మొత్తం 50 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. నరమేధం నిందితునిపై మొదట ఒకే హత్యానేరం కేసు నమోదైంది.

కాల్పులకు పాల్పడిన మరుసటి రోజునే నిందితుడిని మొదట క్రైస్ట్​చర్ట్​ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసులు పెరిగిన నేపథ్యంలో అతని కేసును హైకోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుడు టారంట్​ను భారీ భద్రత నడుమ ఆక్లాండ్​లోని జైలులో ఉంచినట్లు సమాచారం.

నిందితుని తరఫున చట్టపరంగా ప్రాతినిధ్యం వహించే విషయమై వాదనలు ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. గతంలో తన కేసును తానే వాదించుకుంటానన్నాడు టారంట్​.

శ్వేతజాతీయుల ఆధిపత్య ధోరణిని బలంగా వినిపించేందుకు ఈ అవకాశాన్ని టారంట్ వినియోగించుకుంటాడని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details